బెజ‌వాడ ది బెస్ట్ బిజినెస్ డీల్ ఇదే!

Friday, April 20th, 2018, 01:24:07 AM IST

`భ‌ర‌త్ అనే నేను` వ‌ర‌ల్డ్‌వైడ్ బిజినెస్ షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌కి కృష్ణా జిల్లాల్లో, బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఏలే చోట ఉన్న ఫాలోయింగ్ అన‌న్య సామాన్యం. దానిని దృష్టిలో ఉంచుకుని ప్ర‌వీణ్ కుమార్ అనే పంపిణీదారుడు క్రేజీగా ధ‌ర చెల్లించి రిలీజ్ హ‌క్కులు చేజిక్కించుకున్నాడ‌ట‌. విజ‌య‌వాడ ఏరియా హ‌క్కుల‌కు 2.4కోట్లకు వెళ్లింద‌ని తెలుస్తోంది. మ‌ల్టీప్లెక్సులు, సింగిల్‌స్క్రీన్లు, సైడ్ థియేట‌ర్లు అన్నీ క‌లిపి.. మినిమం గ్యారెంటీ ప్రాతిప‌దిక‌పై పంపిణీ హ‌క్కులు తీసుకున్నారు. ఈ సినిమా బాగా ఆడితే తొలి మూడు రోజుల‌కే మొత్తం రిట‌న్ వ‌చ్చేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే మ‌హేష్ అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు బెజ‌వాడ‌లో భారీగా ప్రీమియ‌ర్ల‌న ప్లాన్ చేశారు. ప్ర‌వీణ్ కుమార్ గ‌తంలో క‌బాలి చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక 2.4 కోట్ల డీల్ అంటే ఆష‌మాషీ కాదు క‌దా?

  •  
  •  
  •  
  •  

Comments