చెన్న‌య్‌లో రికార్డ్ బ్రేకింగ్ భ‌ర‌త్‌

Saturday, April 21st, 2018, 11:29:47 PM IST


`భ‌ర‌త్ అనే నేను` ఇంటా బ‌య‌టా రికార్డుల మోత మోగిస్తోంది. ఏపీ, నైజాం, అమెరికా, ఆస్ట్రేలియా .. అన్నిచోట్లా డే-1లో వ‌సూళ్ల త‌డాఖా చూపించింది. కృష్ణ‌, గుంటూరులో భ‌ర‌త్ అనే నేను ఆల్‌టైమ్ రికార్డ్ వ‌సూళ్లు సాధించింది. ప‌నిలో ప‌నిగా త‌మిళ‌నాడులోనూ భ‌ర‌త్ వ‌సూళ్ల రికార్డులు కొన‌సాగుతున్నాయ‌ని రిపోర్ట్ అందింది.

అస‌లు త‌మిళ‌నాడులో భ‌ర‌త్ అనే నేను రిలీజ‌వుతుందా? అన్న సందిగ్ధ‌త ఇన్నాళ్లు నెల‌కొంది. ఓవైపు కోలీవుడ్ థియేట‌ర్ల బంద్ అవిశ్రామంగా సాగుతుంటే ఇక క‌ష్ట‌మేన‌ని నిర్మాత‌లు లైట్ తీస్కున్నారు కూడా. కానీ అనూహ్యంగా ఒక‌రోజు ముందు బంద్ ఎత్తేస్తున్నామ‌ని కోలీవుడ్ ప్ర‌క‌టించ‌డంతో భ‌ర‌త్ నిర్మాత‌లు ఊపిరి తీసుకున్నారు. చెన్న‌య్‌లో గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. అందుకు త‌గ్గ‌ట్టే .. భ‌ర‌త్ రికార్డులు షురు చేశాడు. చెన్న‌య్‌లో రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం`-25ల‌క్ష‌లు, ప‌వ‌న్ `ఆజ్ఞాత‌వాసి` -24ల‌క్ష‌లు వ‌సూలు చేశాయి. ఆ రెండు రికార్డుల్ని భ‌ర‌త్ బ్రేక్ చేశాడు. భ‌ర‌త్ అనే నేను డే-1 లో 27ల‌క్ష‌లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పింది. త‌మిళ‌నాడులో అంత‌కంత‌కు మ‌హేష్ గ్రాఫ్ పెరుగుతోంద‌ని, స్పైడ‌ర్ త‌ర‌వాత అది మ‌రింత‌గా పెరిగింద‌ని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments