భరత్ మాట నిలబెట్టుకున్నాడు .. సౌత్ టాప్ 5 లో చోటు ?

Sunday, April 22nd, 2018, 10:56:10 PM IST

భరత్ అనే నేను .. శాశనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిబద్దతతో .. అంటూ ప్రమాణం చేసిన భరత్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కింది. టాలీవుడ్ లో భారత్ నాన్ బాహుబలి రికార్డులు అందుకున్నాడు. ఇక సౌత్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుని తన సత్తా చాటాడు. సౌత్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రాల్లో ఇప్పటికి బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. ఈ లిస్ట్ లో భరత్ ఏకంగా 5 స్థానాన్ని రాబట్టి తన సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసాడు. ఇక ఈ వెకెండ్ లో ఏకంగా 100 కోట్ల మార్కెట్ ని కొల్లగొట్టేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అత్యంత భారీగా విడుదలైంది. మహేష్ బాబు స్టామినాకు తగ్గట్టుగా భారీగా బిజినెస్ జరిగిన ఈ సినిమా వసూళ్ల పరంగా సంచలనం రేపుతోంది. మరి సౌత్ టాప్ టెన్ సినిమాల్లో భరత్ నంబర్ చూద్దామా ..
సౌత్ లో మొదటి రోజు భారీ వసూళ్లు అందుకున్న చిత్రాలు ..
1, బాహుబలి -2 ( అన్ని భాషలు ) 215. 00 కోట్లు,
2, కబాలి (తెలుగు, తమిళ్,హిందీ ) – 87. 50 కోట్లు,
3, బాహుబలి ( అన్ని భాషలు ) – 73. 00 కోట్లు,
4, అజ్ఞాతవాసి – 60. 50 కోట్లు,
5, భరత్ అనే నేను – 55. 00 కోట్లు,
6, ఖైదీ నంబర్ 150 – 50. 55 కోట్లు,
7, మెర్సల్ – 47. 00 కోట్లు,
8, జై లవకుశ – 46. 60 కోట్లు,
9, రంగస్థలం – 43. 80 కోట్లు,
10, స్పైడర్ ( తెలుగు, తమిళ్ ) – 41. 50 కోట్లు,

  •  
  •  
  •  
  •  

Comments