షాక్ ..లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ వాళ్ళ చిట్టా ఇదే ?

Friday, October 12th, 2018, 09:53:59 PM IST

ప్రముఖ నటుడు నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించాడని హీరోయిన్ తనుశ్రీ దత్త ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మీ టూ అంటూ పెద్ద దుమారమే చెలరేగుతుంది. పలువురు హీరోయిన్స్ ఈ విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ లైంగిక వేధింపుల లిస్ట్ లో బాలీవుడ్ లో పెద్ద లిస్టే ఉంది. ఈ లిస్ట్ లో నానా పాటేకర్ తోపాటు , అలోక్ నాథ్ ఇతనిపై టివి దర్శకురాలు వినీత నంద ఆరోపణలు చేసారు, అలాగే వికాస్ బహల్ ..ఈ క్వీన్ సినిమా దర్శకుడు నన్ను కూడా వేధించాడని ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ చెప్పింది.ఈ లిస్ట్ లో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ కూడా ఉండడం సంచలనం రేపుతోంది.

ఓ మహిళా ట్విట్టర్ లో సుభాష్ పై ఘాటు ఆరోపణలు గుప్పించింది. తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది. రజత్ కపూర్ ప్రముఖ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న రజత్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా పేర్కొంది. తాజాగా భరత్ అనే నేను లో వచ్చాడయ్యో సామి అంటూ పాట పాడిన బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. కైలాష్ తనను వేధించాడని మహిళా గాయని సోనా మహాపాత్ర తెలిపింది. అబిజిత్ భట్టాచార్య ఈయనపై కూడా ఓ మహిళా తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. సాజిద్ ఖాన్ .. దర్శకుడు సాజిద్ ఖాన్ ఓ మహిళా జర్నలిస్ట్ ని లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొనడం పెద్ద దుమారాన్నే రేపింది. మొత్తానికి ఒక్కొక్కటిగా బాలీవుడ్ లో లైంగిక వేధింపుల లిస్ట్ బయటకు వస్తూనే ఉంది.