నోటా దెబ్బకు నిర్మాత విలవిల ?

Thursday, October 11th, 2018, 10:54:30 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా తమిళ తెలుగు భాషల్లో ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన నోటా చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విడుదలకు ముందు భారీ అంచనాలను పెంచుకున్న ఈ సినిమా ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ కి తాజాగా గీత గోవిందంతో మంచి సక్సెస్ దక్కింది. ఈ సినిమాతో విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద వందకోట్ల హీరోగా నిలబడ్డాడు. అదే అంచనాలతో విడుదలైన నోటా అటు తమిళంలో కూడా భారీ నిరాశని మిగిల్చింది. ఇక తెలుగులో అయితే విజయ్ పై కౌంటర్లు కూడా దారుణంగా వేస్తున్నారు.

తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించడమే కాకుండా తెలుగులో సొంతంగా విడుదల చేసాడు. దాంతో ఆయనకు బిడ్డ బ్యాండ్ పడింది. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కేవలం 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అటు తమిళంలో కూడా అలాగే ఉంది పరిస్థితి. నిజానికి ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులకోసం నైజాం నుండి 4 కోట్లు, సీడెడ్ నుండి 2 కోట్లు ఇస్తామని అఫర్ వచ్చిందట .. అయితే అంత తక్కువ రేట్ కు ఇవ్వను సొంతంగా నేనే విడుదల చేస్తానని జ్ఞానవేల్ రాజా డేర్ చేసాడు .. ఫలితంగా సినిమా రిజల్ట్ తారుమారైంది. మొత్తానికి భారీ నష్టమే మిగిలింది.