“సరిలేరు నీకెవ్వరు”టీమ్ కు ఊహించని షాక్..స్టోరీ అంతా లీక్!

Sunday, November 17th, 2019, 08:42:45 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రం కోసం అభిమానులు సహా టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ కు ఇప్పుడు షాక్ తగిలేలా ఉంది.మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం తాలూకా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తుంది.

సినిమా మొదలు కావడమే మహేష్ మిలట్రీ ట్రైనింగ్ తో మొదలవుతుందని ఆ తర్వాత ట్రైన్ జర్నీలో హీరోయిన్ ను కలుసుకుంటాడని ఆ తర్వాత బండ్ల గణేష్ మరియు కొంత మంది “జబర్దస్త్”నటులతో రొటీన్ స్కిట్స్ లాంటి కామెడీ ఎపిసోడ్స్ ఉంటాయని అలాగే మహేష్ కర్నూల్ లో దిగాక అక్కడ పొలిటియన్ అయినటువంటి విజయశాంతితో కొన్ని రాజకీయ సమస్యల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని వాటిని హీరో ఎలా ఎదుర్కొని పరిష్కారం చూపించాడు అన్నదే అసలు కథ అని..

ఇలాంటి కథలో పెద్దగా ఏమీ లేదు పరమ రొటీన్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది.అయితే ఇలాంటి ప్రచారం చేసేవారు ఒకటి గమనించాల్సి ఉంది.ఇప్పటి వరకు ఎందరో స్టార్ హీరోలు ఏమంత గొప్ప కథలు లేకుండా కమెర్షియల్ ఎలిమెంట్స్ తో హిట్టు కొట్టలేదా?ఇది కూడా అలాగే అనుకోవాలి ఒకవేళ కథ ఇలాగే ఉన్నా సరే దర్శకుడు అనీల్ టేకింగ్ వర్కౌట్ అయ్యినట్టైతే ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.