“పింక్” రీమేక్ పై బిగ్ సస్పెన్స్.!

Friday, December 13th, 2019, 07:00:58 AM IST

చాలా కాలం నుంచి టాలీవుడ్ లో బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” రీమేక్ పై సస్పెన్స్ అలా కంటిన్యూ అవుతూనే వస్తుంది.ఇప్పటికే హిందీ మరియు తమిళ్ లో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కనిపిస్తారని వార్తలు కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి.అలాగే పవన్ ఆ దర్శకునితో చేస్తున్నాడు.ఈ దర్శకునితో చేస్తున్నాడు,ఇప్పటికే క్రిష్ ఓ కథను కూడా తయారు చేసేశారని ఇలా అనేక పుకార్లు టాలీవుడ్ వర్గాల్లో హోరెత్తాయి.

కానీ పవన్ నుంచి మాత్రం అసలు ఎలాంటి స్టేట్మెంట్ కూడా రాకపోవడంతో ఈ సస్పెన్స్ మరింత పెద్దది అయ్యిపోయింది.దానికి తోడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నిర్మాత దిల్ రాజు కూడా ఎక్కడా పవన్ పేరే బయటకు రాకుండా మరింత సస్పెన్సును ఇప్పుడు మైంటైన్ చేస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి థమన్ ను సంగీత దర్శకునిగా తీసుకున్నామని చెప్పి అప్డేట్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడా పవన్ పేరును బయటపెట్టలేదు దీనితో ఓ రకమైన గందరగోళ వాతావరణం నెలకొంది.మొత్తానికి అయితే మాత్రం ఇప్పుడు పింక్ రీమేక్ విషయంలో ఓ పెద్ద సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది.