బిగ్ అప్డేట్ : పవన్ సినిమా ఖరారు – హీరోయిన్లు ఎవరో తెలుసా…?

Saturday, December 14th, 2019, 07:46:47 PM IST

సినిమాల్లో ఒక వెలుగు వెలిగి, ఆ తరువాత ప్రజా సేవ మీద ఉన్నటువంటి మక్కువతో రాజకీయాల్లోకి వచ్చి, ఒక రాజకీయ పార్టీని స్థాపించి, జయాపజయాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రజలందరితో కలిసిపోడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటిని ఎన్నికల తరువాత ఇకమీదట సినిమాలు చేయబోనని అధికారికంగా ప్రకటించారు. కాగా అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయడానికి అంగీకరించారు. కాగా పవన్ తన రీ ఎంట్రీ సినిమాను ఎలాంటి కథ తో చేస్తాడనే అంశం గత కొద్దీ రోజులుగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.

కాగా పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా ఎట్టకేలకు ఖరారయింది. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ లో నటించనున్నారని సమాచారం. కాగా ఈ చిత్రానికి తెలుగులో వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోణి కపూర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ నివేద థామస్, తెలుగమ్మాయి అంజలి రెండు కీలక పాత్రలు చేయడానికి ఒప్ప్పుకున్నారని, మరొక కీలక పాత్రకు మాతృకలో నటించిన తాప్సిని తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నార్నయి సమాచారం. కానీ తదితర వివరాలు అన్ని కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది…