మామిడి చెట్టు ఎక్కిన వితిక..వరుణ్ ఎక్కడున్నాడో.?

Sunday, May 24th, 2020, 02:52:10 PM IST

ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో మంచి చురుకుగా ఉన్నారు. ఇటీవలే తారక్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ 1 కంటెస్టెంట్స్ అంతా ఓసారి మళ్ళీ కనిపించగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కో రకంగా కనిపిస్తూ బిగ్ బాస్ ఫాలోవర్స్ కు మంచి కిక్కిస్తున్నారు.

మొన్ననే టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గుండు లుక్ లో కనిపించి ఆశ్చర్యపర్చగా నిన్న మరో కంటెస్టెంట్ శివజ్యోతి తొక్కుడు బిళ్ళ ఆడుతూ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంది. ఇప్పుడు ఇదే షోలో మోస్ట్ లవ్డ్ కంటెస్టెంట్ అయిన వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు తన మామిడి తోటలో మామిడి కాటాలు కోస్తూ కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో అయితే వరుణ్ ఎక్కడా కనిపించలేదు కానీ ఈ వీడియో మాత్రం చాలా నాచురల్ గా మంచి ప్లెసెంట్ గా ఉందని చెప్పాలి.