ఆ రోజు పవన్ చెప్పిన మాటలని గుండెల్లో పెట్టుకుంటా..కౌశల్!

Tuesday, October 2nd, 2018, 07:02:25 PM IST

తెలుగు బుల్లితెర మీద సంచలనానికి దారి తీసిన షో బిగ్ బాస్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.బిగ్ బాస్ రెండు సీసన్లను బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.రికార్డు స్థాయిల్లో టీఆర్పీలను అందించారు. ఇటీవలే బిగ్ బాస్ రెండో సీసన్ కూడా చాలా ఉత్కంఠభరితంగా ముగిసింది.ప్రేక్షకుల అంచనాల మేరకు తన వన్ మాన్ షో తో బిగ్ బాస్ టైటిల్ ను కౌశల్ చాలా పెద్ద ఓట్ల మార్జిన్ తోనే గెలుచుకున్నాడు.

ఐతే ఆ తరువాత తాను బయటకి వచ్చి తన అభిమానులు తనకి ఇచ్చిన ఆదరణను ఎప్పటికి మర్చిపోలేనని, తన విజయానికి కారణమైన వాళ్ళని తనని ప్రభావితం చేసిన వారి కోసం చెప్పుకొచ్చాడు.తాను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మహేష్ బాబు గారని,తన రాజకుమారుడు సినిమా నుంచి తనకి మహేష్ అండగా ఉన్నారని తెలిపారు.అదే సందర్భంలో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ తో బద్రి,ఖుషి చిత్రాలకు పనిచేసినప్పుడు తన పనిని చూసి ఒకరోజు తన పక్కన కూర్చొని “నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది కౌశల్,జీవితమంటే కష్టపడడం కాదు ఆ పడిన కష్టాన్ని పది కాలాల నిలబెట్టుకోవడం”అని అన్నారు అని తెలిపారు.తనకి పవన్ ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పటికి గుర్తున్నాయని,తాను ఇప్పటివరకు పడిన కష్టం ఒకెత్తు అయితే ఇక నుంచి తాను మిగతా జీవితాన్ని తన కష్టంతో నిలబెట్టుకుంటానని,ఖచ్చితంగా పవన్ మాటలను తన గుండెల్లో పెట్టుకుంటానని కౌశల్ తెలిపారు.