ఈ లెక్కన “బిగిల్” డిజాస్టర్ గా మిగిలిపోతుందా..?

Wednesday, October 16th, 2019, 06:34:00 PM IST

ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “బిగిల్” తెలుగులో “విజిల్” సినిమా రానున్న దీపావళికి విడుదల కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలయ్యి అద్దిరిపోయే స్పందనను రాబట్టింది.అతి తక్కువ సమయంలోనే మొట్టమొదటి సారిగా 2 మిలియన్ లైక్స్ అందుకున్న భారతీయ ట్రైలర్ గా బిగిల్ ట్రైలర్ నిలిచింది.

ఒక పక్క విజయ్ మరోపక్క అట్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇప్పటికే అదరగొట్టేశాయి.ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఈ అంచనాలు ఎలా ఏర్పడతాయో కొన్ని సెంటిమెంట్స్ కూడా మన దేశీయ సినిమాల్లో బలంగా నాటుకుపోయింది.కొంతమంది నటుల మూలాన సినిమా హిట్టవుతుందా ప్లాప్ అవుతుందా అన్న దాన్ని ఆయా నటులకు ఆపాదించడాన్ని మనం ఇప్పటికే చాలా చూసాము.

మరి ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ చిత్రం దారుణమైన ప్లాప్ గా నిలిచిపోవడం ఖాయమని అంటున్నారు.ఈ సినిమాలో ఓ నటుని కారణంగా ఖచ్చితంగా ప్లాప్ అయిపోతుందని చాలా మంది అంటున్నారు.ఆయన ఒక్క హిందీ మినహా నటించిన మిగతా భాషల చిత్రాలు దారుణమైన పరాజయాన్ని చూశాయి.

ఇంకా చెప్పాలంటే ఆ హీరోల ఖాతాలోనే అతి పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే ఇప్పుడు ఆ నటుడు ఎవరో ఇప్పటికే చాలా మందికి తెలుసు.ఈ లెక్క ప్రకారం బిగిల్ సినిమాకి కూడా అదే గతి పడుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి.మరి ఈ చిత్రం అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేక ముందు సినిమాల్లానే డిజాస్టర్ గా నిలిచిపోతుందో చూడాలి.