హాట్ టాపిక్ : సౌత్ సినిమా తో విదేశాల్లో ధియేటర్లు పునః ప్రారంభం

Friday, June 19th, 2020, 06:40:31 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా తయారు అయ్యాయి. లాక్ డౌన్ సడలింపు చర్యల కారణంగా పాజిటివ్ కేసులు విపరీతం గా పెరిగిపోతున్నాయి. అయితే విదేశాల్లో మాత్రం పలు చోట్ల కరోనా వైరస్ మహమ్మారి పేట్రేగిపోతోంది, అయినప్పటికీ అక్కడ ధియేటర్లు ప్రారంభించేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చసుకుంటున్నారు. అయితే విదేశాల్లో మన సినిమాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్షయ్ కుమార్ సినిమా దుబాయ్ లో విడుదల అయింది.

తాజాగా ఫ్రాన్స్, జర్మనీ లలో తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ చిత్రం విడుదల కానుంది. విజయ్ నటించిన బిగిల్ చిత్రం తో అక్కడ ధియేటర్లు పునః ప్రారంభం కానున్నాయి. జూన్ 22 న ఫ్రాన్స్ లో, 30 న జర్మనీ లో ఈ చిత్రం విడుదల కానుంది. గతేడాది దీపావళి కి విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అంతేకాక భారత్ లో సైతం సినిమా హాళ్ల ప్రారంభం కోసం ప్రెక్షకు ఎదురు చూస్తున్నారు.