రియా కి బీహార్ పోలీసులు లుకౌట్ నోటీసులు..!

Thursday, July 30th, 2020, 02:29:14 AM IST


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి ను ఇప్పటికే పలు మార్లు పోలీసులు విచారణ జరిపారు. ఈ కేసులో బాలీవుడ్ ప్రముఖులను సైతం విచారించడం జరిగింది. అయితే తాజాగా మరొకసారి ఈ కేసులో రియా చక్రవర్తి పై పలు ఆరోపణలు రావడం తో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో, వారు రియా ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ చేరుకున్న పోలీసులకు రియా కనబడలేదు. రియా కనిపించకుండా పోవడం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు.

అయితే రియా బీహార్ పోలీసులకు సహకరించెలా కనబడుట లేదు అని తెలుస్తోంది. బీహార్ నుండి ముంబై కి కేసును బదిలీ చేయాలి అంటూ రియా సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేయడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే బీహార్ పోలీసులు మాత్రం రియా కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి దీని పై రియా చక్రవర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.