వాల్మీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత లక్ష్మణ్

Tuesday, September 17th, 2019, 01:22:51 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం “వాల్మీకి”… హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజ హెగ్డే ఈ చిత్రంలోకథానాయికగా నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఓక కొత్త అవతారం లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. అయితే ఈ చిత్ర్రం ప్రారంభం అయినప్పటి నుండి కూడా కొన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా తీవ్రతరం అవుతున్నాయి. కాగా ఈ వాల్మీకి చిత్ర టైటిల్ పలు వివాదాలకు దారి తీస్తుంది. ఈ టైటిల్ బోయ కులస్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, కాగా తక్షణమే ఆ చిత్ర టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. .

అయితే ఒక గ్యాంగ్‌స్టర్ ఒక్కసారిగా ఎలా మంచివాడిగా మారాడు అనేది కథ. కాగా అందుకోసమనే ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ పెట్టమని చెబుతున్నారు. కాగా ఈ చిత్రంలో ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా సన్నివేశాలు ఉంటాయని, ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని, ఎట్టి పరిస్థితిలో ఈ చిత్ర టైటిల్ మార్చబోయేది లేదని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. కాగా తాజాగా ఈ గొడవలోకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఎంటర్ అయ్యాడు. అయితే బోయ సంఘం వారు లక్ష్మణ్ కి ఈ వివాదం కోసం ఫిర్యాదు చేయగా ఆయన కూడా వారికే మద్దతు తెలిపారు. ఇకపోతే ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాకి ఇలా వాల్మీకి పేరు పెట్టడం చాలా తప్పని, ఈ విషయం మీద సెన్సార్ బోర్డు కి ఫిర్యాదు చేశామని చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ మార్చకపోతే బోయవాళ్ళందరూ కూడా ఏకం అయి నిరసనలు తెలుపుతారని, ఆ తరువాత జరిగే పరిణామాలకు చిత్ర బృందమే పూర్తీ బాధ్యత వహించాలని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.