ప‌నోళ్ల‌కు `పెద్ద నోట్లు` పంచేసిన స్టార్‌హీరో వైఫ్‌?!

Wednesday, November 16th, 2016, 11:04:53 PM IST

girl-shade
500 , 1000 నోట్ల ర‌ద్దు క‌ల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా దీని ప్ర‌భావం టాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ఓ రేంజులో ఉంద‌న్న‌ది తాజా స‌ర్వే. బ‌డా హీరోల పారితోషికాలు కోట్ల‌లో ఉంది కాబ‌ట్టి `బ్లాక్‌`పై ప‌డిన పంచ్‌తో గిలగిలా కొట్టుకుపోతున్నార‌న్న టాక్ ఉంది. ఓవైపు మోదీ చ‌ర్య‌ను స‌మ‌ర్థిస్తూనే ఇదేం త‌ల‌నొప్పిరా దేవుడా! అంటూ బుర్ర గోక్కుంటున్నావాళ్లున్నారు. ఏదైతేనేం ఈ పంచ్ వ‌ల్ల సెల‌బ్రిటీల ఇళ్ల‌లో ప‌నిచేసే ప‌నోళ్ల‌కు బాగా క‌లిసొచ్చింద‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్‌.

టాలీవుడ్‌కి చెందిన ఓ ప్ర‌ముఖ హీరో ఇంట్లో జ‌రిగిన క‌రెన్సీ పంపిణీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌. ఏ న‌లుగురు గుమిగూడినా ఆ విషయంపైనే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌ధాని మోదీ ఏ క్ష‌ణం అయితే పెద్ద నోట్ల ర‌ద్దును ప్ర‌క‌టించారో.. ఆ క్ష‌ణం స‌ద‌రు హీరోగారి భార్య ఓ పెద్ద మొత్తాన్ని రెడీ చేసి ఇంట్లో ప‌ని చేసే ప‌నోళ్ల (వంటోడు, ఇస్త్రీవాడు, మేనేజ‌ర్లు, రిసెప్ష‌న్లు వ‌గైరా వ‌గైరా.. )కు పంచేసే ప‌ని పెట్టుకున్నారు. అది కూడా క్యాష్‌ని ప‌నోళ్ల అకౌంట్ల‌లోకి పంపిణీ చేశారుట‌. త‌లో రెండున్న‌ర‌ ల‌క్ష‌లు వేసి.. ఎంజాయ్ చేస్కోమ‌ని చెప్పారుట‌. అయితే ఇలా పెద్ద నోట్లు అలా అకౌంట్ల‌లోకి వేసిన మ‌రుస‌టి రోజే మ‌రో ట్విస్టు కూడా ఇచ్చారుట స‌ద‌రు హీరోగారి భార్యామ‌ణి.

ఇదిగో భ‌య్యా..! నిన్న మీ అకౌంట్లో వేసింది ఏడాదికి స‌రిప‌డే శాల‌రీ. ఇక నెల‌నెలా ఇచ్చే ప‌ద్ధ‌తికి స్వ‌స్థి ప‌లికాం. అందుకే ఒకేసారి అకౌంట్లో శాల‌రీ పే చేశాం… అంటూ అనూహ్య‌మైన ట్విస్టిచ్చారు స‌ద‌రు హీరో గారి భార్య‌. అంతేకాదండోయ్‌.. ఒకేసారి సంవ‌త్స‌రానికి స‌రిప‌డా శాల‌రీ ముందే పే చేసేశాం కాబ‌ట్టి .. ఏడాదంతా స్ట్రిక్టుగా ప‌నిచేయాలి.. అన్నారు. మ‌రో ట్విస్టేమంటే.. ఏడాది జీతం ఒకేసారి పే చేశాం కాబ‌ట్టి .. రెగ్యుల‌ర్ నెల జీతం సైజు త‌గ్గించామ‌ని మ‌రో ట్విస్టిచ్చారు. అంటే నెల‌కు రూ.15000 జీతం అందుకునే ప‌నోడికి రూ.3 వేలు క‌ట్ చేసి ఇచ్చార‌న్న‌మాట‌!