క‌శ్మీర్ ఉగ్ర‌వాదం, యూరి ఎటాక్స్‌పై మూవీ..

Wednesday, April 4th, 2018, 11:29:14 PM IST

క‌శ్మీర్ తీవ్ర‌వాదంపైనా, పాక్ ముష్క‌ర ఉగ్ర‌వాద‌పైనా బోలెడ‌న్ని సినిమాలొచ్చాయి. బోర్డ‌ర్ దాటి ప్ర‌వేశించే ముష్క‌రులు నిత్యం ఎంద‌రో అమాయ‌కుల్ని బ‌లి పెడుతుంటారు. భార‌త జావ‌న్ల‌పైనా ముష్క‌ర దాడుల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఈ త‌ర‌హా దాడులు ఇదివ‌ర‌కూ అత్యంత పాశ‌విక స‌న్నివేశాన్ని త‌ల‌పించ‌డం సంచ‌ల‌న‌మైంది. క‌శ్మీర్ -యూరి సెక్టార్‌లో ఉగ్రదాడి ప్ర‌కంప‌నాలు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. భార‌త స‌రిహ‌ద్దు దాటి వ‌చ్చి మరీ పాక్ ఉగ్రమూకలు 12వ ఇన్ ఫ్రాంటీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై దాడికి పాల్ప‌డ్డాయి. 19మంది భార‌తీయ జవాన్లను అన్యాయంగా పొట్టుపెట్టుకున్నారు. అంతర్జాతీయంగా ఈ దాడుల‌కు పాల్ప‌డ్డ పాక్ ముష్క‌రుల్ని దుయ్య‌బ‌ట్టినా, అస‌లు త‌మ‌కే సంబంధం లేద‌ని పాకిస్తాన్ వాదించింది.

ఇలాంటి కీల‌క ఘ‌ట‌న ఇతివృత్తంగా ప్ర‌స్తుతం ఇర్ఫాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. ఇర్ఫాన్‌ఖాన్‌, కీర్తి కుల్హారీ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం న‌టీన‌టులు శిక్ష‌ణ కూడా తీసుకుంటున్నారు. మంచు కొండ‌ల్లో హెలీకాఫ్ట‌ర్ ఛేజ్‌లు, గ‌న్ ఫైరింగ్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుంటున్నానని కీర్తి తెలిపారు.