హిందీలో అర్జున్ రెడ్డి మొదలెట్టేసాడు ?

Sunday, May 13th, 2018, 04:25:16 AM IST


టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ సినిమా సంచలన విజయంతో పరభాషల్లో రీమేక్ చేయడానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ అవుతుండగా .. హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక్క సినిమాతో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసాడు సందీప్ వంగ. హిందీలో ఈ సినిమా రీమేక్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. మరి బాలీవుడ్ లో ఈ అర్జున్ రెడ్డి ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.