శ్రీదేవి మృతిపై స్పందించిన బోణీ కపూర్.. ఏమన్నాడో తెలిస్తే షాక్..!

Saturday, July 13th, 2019, 11:02:10 PM IST

అందాల తార నటి శ్రీదేవి మృతిపై కొద్ది రోజులుగా అనేక సంచలన నిజాలు భయటపడుతున్నాయి. అయితే నటి శ్రీదేవి బాత్ ట‌బ్‌లో ప‌డి మ‌ర‌ణించిందని మనకు తెలుసు. అయితే తాజాగా కేర‌ళ‌కి చెందిన జైళ్ళ శాఖ డీజీపీ రిషి రాజ్ సింగ్ శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని అన్నారు. త‌న ఫ్రెండ్‌, ఫోరెన్సిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఉమాద‌త‌న్ శ్రీదేవి మ‌ర‌ణం గురించి నాతో కొన్ని విష‌యాలు చెప్పాడని అన్నారు.

అంతేకాదు శ్రీదేవిది సహజ మరణం కాదని హ‌త్య చేయ‌బ‌డింద‌ని నా ఫ్రెండ్ నాతో చెప్ప‌డంతో దానిపై ఆరా తీసాను. అయితే శ్రీదేవి మృతిపై కొన్ని కీల‌క ఆధారాల‌ని బ‌ట్టి చూస్తుంటే ఆమెది యాక్సిడెంట‌ల్్‌గా జరిగిన మరణం కాదని, ఎవ‌రో కావాల్ని చంపేసారని క్లియ‌ర్‌గా అర్ధ‌మ‌వుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విష‌యాలపై స్పందించిన శ్రీదేవి భర్త బోనిక‌పూర్ దీనిపై ఘాటుగా స్పందించారు. అయితే సరైన ఆధారాలు లేకుండా ఎవరో ఏదో వాగితే నేను పట్టించుకోనని ఇలాంతి వాటిపై నేను స్పందిండం కూడా వృధానే అని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వారతలను నేను అసలు ప‌ట్టించుకోనని ఎవరో ఒకరు ఇలాంటివి పుట్టిస్తూనే ఉంటారని అన్నారు.