నాగ్ దైర్యం ఏమిటో..? లేనిపోని గొడవలు ఎందుకు

Friday, June 14th, 2019, 11:40:11 AM IST

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉన్న సినిమా సాహూ. ఆగస్టు 15న విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. అయితే ఆగస్టు 9న నాగార్జున నటిస్తున్న “మన్మధుడు 2” విడుదల చేస్తున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించటం జరిగింది. అంటే సాహూ రావటానికి సరిగ్గా వారం రోజుల ముందు మన్మధుడు 2 రానుంది. నిజానికి సాహూ సినిమాకి వారం ముందు నుండి, సాహూ సినిమా విడుదల తర్వాత రెండు వారలు దాక మరో సినిమా ఏది రావటానికి సాహసించటం లేదు. కానీ నాగ్ మాత్రం దైర్యం చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

ఇక్కడ ముఖ్యంగా థియేటర్లు సమస్య వస్తుంది. సాహూ లాంటి సినిమా వస్తుంటే గంపగుత్తగా థియేటర్లు అన్ని సాహూకే కేటాయిస్తారు. సరే నాగార్జునకి టాలీవుడ్ లో ఉన్న సర్కిల్ వలన కొన్ని థియేటర్లు అయితే దొరుకుతాయి, కానీ సాహూని కాదని మన్మధుడిని చూసేవాళ్ళు చాలా తక్కువ.. అందరి చూపు శిఖరం వైపు ఉంటుంది కానీ, కింద వుండే రాయి మీద ఉండదు కాదు. ఒక వేళా సినిమా మంచి విజయం సాధిస్తే, సాహూ వచ్చే దాక దానికి తగ్గ వసూళ్లు దానికి వస్తాయి, కానీ సాహూ రిలీజ్ అయినా మరుక్షణం దారుణంగా థియేటర్లుల ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. మంచి సినిమా అనే పేరు తప్ప కలెక్షన్స్ రావటం కష్టం.

దానికి తోడు కొందరు అరేయ్ సాహూ వస్తుంది కదా, దానికి పోదాం మళ్ళి మన్మధుడు 2 కి డబ్బులు అవసరమా అనే ఆలోచన కూడా చేసే అవకాశం ఉంది. ఇక ఖర్మకాలి సినిమాకి కొంచమైనా నెగిటివ్ టాక్ వస్తే మాత్రం కనీసం మొదటి మూడు రోజులు కూడా హౌస్ ఫుల్ పడే పరిస్థితి ఉండదు. ఇక సాహూ వచ్చిన తరువాత చెప్పపెట్టకుండానే మన్మధుడు సినిమాని థియేటర్లు నుండి తీసేస్తారు.. ఇలా ఎటు పక్క చూసిన మన్మధుడు 2 ఆగస్టు 9 రావటం వలన ఆ సినిమాకే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది.. ఇవన్నీ తెలిసిన కానీ నాగ్ ఎందుకు ఇలా మొండిగా ముందుకి వెళ్తున్నాడో అర్ధం కావటం లేదు.