బాలయ్య సినిమాకు బోయపాటి భారీ ప్లానింగ్.!

Saturday, December 14th, 2019, 03:33:41 PM IST

ఏ ఇండస్ట్రీలో అయినా సరే అక్కడ ఉండే దర్శకులు మరియు హీరోలు చేస్తున్న ప్రాజెక్టుల రీత్యా అంచనాలు ఏర్పడతాయి.అలాగే కొంతమంది దర్శకులు మరియు హీరోలకు కలిపి ఒక కాంబినేషన్ గా ఓ బెంచ్ మార్క్ ఉంటుంది.అయితే టాలీవుడ్ లో అలాంటి బెంచ్ మార్క్ ఉన్న కాంబినేషన్లలో మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ నటసింహం బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనులది అని చెప్పాలి.

ఈ ఇద్దరి కాంబో అంటే నందమూరి ఫ్యాన్స్ సహా మాస్ ఆడియెన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది.బాలయ్య కోసమే అన్నట్టుగా బోయపాటి రాసే డైలాగులు ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగిస్తాయి.అలా ఈ కాంబో కు ఒక ప్రత్యేకత ఏర్పడింది.అయితే ముచ్చటగా మూడోసారి ఈ కాంబో నుంచి ఇప్పుడు ఒక చిత్రం తెరకెక్కబోతున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం బోయపాటి భారీ ప్లానింగే చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి గాను దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ పెట్టనున్నారని అలాగే హీరోయిన్ మరియు విలన్ పాత్రలకు ఏకంగా బాలీవుడ్ నుంచి అగ్ర శ్రేణి నటులను రంగంలోకి దింపబోతున్నారని బజ్ వినిపిస్తుంది.బజ్ ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా “కేజీయఫ్ చాప్టర్ 2″లో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం.మరి ఇదే కానీ నిజమైతే బోయపాటి నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ టచ్ చెయ్యడం పక్కా అని చెప్పాలి.