మాస్ కమర్షియల్ సినిమాలు చేయడంలో సిద్ధహస్తుడు బోయపాటి శ్రీను. ఆయన శైలి కథలకి సరిపోయే కథానాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఇటీవల కథానాయకులంతా సున్నితమైన కథల్లో నటించడానికే ఇష్టపడుతున్నారు. దీంతో యాక్షన్, మసాలా ఎలిమెంట్స్‌తో సిద్ధమయ్యే కథలకి సరిపోయే హీరోలు తక్కువైపోతున్నారు. ఆ తరహా కథల్ని సిద్ధం చేసే దర్శకులు వెంట వెంటనే సినిమాలు చేయలేకపోతుండటానికి కారణం కూడా అదే. తెలుగులో బోయపాటి శ్రీనుకి ఆ తరహా కష్టాలే ఎదురవుతుంటాయి. `సరైనోడు`తో బంపర్ హిట్టు కొట్టాడు బోయపాటి. కానీ కొత్త సినిమాని ఇప్పటిదాకా పట్టాలెక్కించలేదు. అందుకు కారణం కథానాయకులే. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను దృష్టి సూర్యపై పడినట్టు తెలుస్తోంది. ఆయన చేసిన సింగం సినిమాలు బోయపాటి తరహా కథలతో తెరకెక్కినవే. అందుకే తాను రాసుకొన్న కొత్త కథకి ఆయనే సరైన హీరో అనుకొంటున్నాడట బోయపాటి. త్వరలోనే కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.