“సాహో” పోస్టర్ లో ఇంత మీనింగ్ ఉందా..?

Sunday, August 18th, 2019, 04:14:03 PM IST

ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా సాహో ఫీవర్ పట్టుకుంది.విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికే ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలతో బిజీ కాగా ఈరోజు అసలు సిసలైన కార్యక్రమం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమయం వచ్చింది.ఒక్క ఈ ఈవెంట్ కోసమే దాదాపు 2 కోట్ల భారీ ఖర్చు చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా ఒక పోస్టర్ ను సాహో బృందం అధికారికంగా విడుదల చేసింది.ఈ పోస్టర్ ను చూస్తే మాత్రం ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు టీజర్ ట్రైలర్లకు ఏమాత్రం సంబంధం లేదనిపించేలా కనిపిస్తుంది.కానీ ఈ ఒక్క పోస్టర్ లో ఒక లోతైన భావం కనిపిస్తుంది అని చెప్పాలి.

ఇప్పటికే మనం చూసిన ట్రైలర్ లో ప్రభాస్ కు హీరోయిన్ శ్రద్దాయే షాక్ ఇస్తుందని అర్ధం అయ్యిపోయింది.అయితే ఈ ట్విస్ట్ ను సినిమాలో ముందే రివీల్ చేసేశారని చెప్పొచ్చు.ఇప్పుడు ఈ పోస్టర్ ను గమనించినా అదే అర్ధం అవుతుంది.ప్రభాస్ శ్రద్దాను హత్తుకుని ఉన్నాడు,ఇద్దరి గన్స్ కూడా ఉన్నాయి.కానీ ప్రభాస్ చేతిలో ఉండకుండా పక్కన ఉంటుంది.అలాగే అతను తన ప్రేమను ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు.కానీ శ్రద్దా మాత్రం ఎలాంటి ఫీలింగ్ కూడా లేకుండా గన్ పట్టుకొని ఉంది.దీన్ని బట్టి శ్రద్దా పాత్ర ప్రభాస్ కు వెన్నుపోటు పొడిచేలా ఉందని మరోసారి ఈ పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతుంది మరి ఇలాంటి షాకింగ్ ట్విస్టులు సుజీత్ ఇంకెన్ని పెట్టాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.+