బ్రేకింగ్ న్యూస్ : సురేష్ ప్రొడక్షన్స్ పై ఐటీ దాడుల కలకలం.!

Wednesday, November 20th, 2019, 10:20:27 AM IST

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ సోదరుడు మరియు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత అయినటువంటి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తాలూకా సంస్థలు ఇంట్లో మరియు రామ నాయుడు స్టూడియోస్ లో ఐటీ దాడుల కలకలం ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.ఈరోజు తెల్లవారు జాము ఉదయం 5 గంటలకే ఐటీ అధికారులు రామానాయుడు స్టూడియోస్ మరియు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో సోదాలు చెయ్యడం షాకింగ్ గా మారింది.

ఇదిలా ఉండగా వీరికి ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయని వచ్చిన వదంతుల మూలంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.గత నాలుగేళ్ల నుంచి కూడా వీరు చేపట్టిన పనులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ను వీరు పరిశీలితున్నారని కూడా తెలుస్తుంది.మొత్తం మూడు గ్రూపులుగా విడిపోయి సురేష్ బాబు ఆస్తుల వివరాలపై వీరు ఆరా తీస్తున్నారని వచ్చిన వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.