చిరు.. బ‌న్నీల‌కి ఓ సినిమా సెట్ చేశారు!

Monday, September 19th, 2016, 10:10:26 AM IST

chiru-allu-arjun
క‌న్న‌డ‌లో క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `దొడ్డమానే హడ్గ`. అందులో పునీత్ రాజ్‌కుమార్‌, అంబ‌రీష్ న‌టిస్తున్నారు. ఇంకా ఆ చిత్రం విడుద‌ల కానే లేదు. కానీ అప్పుడే మెగా ఫ్యామిలీ ఆ చిత్రంపై క‌న్నేసిన‌ట్టు తెలిసింది. చిరంజీవి, అల్లు అర్జున్ క‌లిసి చేయ‌గ‌లిగిన క‌థ అని, క‌న్న‌డ‌లో ఫ‌లితం బాగా వ‌చ్చిందంటే దాన్ని తెలుగులో రీమేక్ చేద్దామ‌ని నిర్మాత అల్లు అర‌వింద్ నిర్ణ‌యించుకొన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. రాజ్‌కుమార్ కుటుంబానికీ, మెగా కుటుంబానికి మంచి అనుబంధ‌ముంది. ఆ అనుబంధంతోనే ఒక‌సారి పునీత్ రాజ్‌కుమార్ తాను చేస్తున్న ఆ సినిమా గురించి మెగా ఫ్యామిలీకి చెప్పాడ‌ట‌. క‌థ అల్లు అర‌వింద్‌కి న‌చ్చ‌డంతో అక్క‌డ వ‌చ్చే రిజ‌ల్ట్‌నిబ‌ట్టి రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నాడ‌ట‌. పునీత్ పాత్ర‌లో అల్లు అర్జున్‌, అంబ‌రీష్ చేసిన పాత్ర‌లో
చిరంజీవి క‌నిపిస్తార‌న్న‌మాట‌. అదే కాంబోగ‌న‌క సెట్ట‌యితే ఇక మెగా అభిమానుల‌కి అంత‌కంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది? కానీ ఈ విష‌యం మ‌రీ ఈ ద‌శ‌లో మాట్లాడుకోవ‌డం టూ అర్లీ అబ్బా!!