బన్నీ అందుకే నో ‘టా’ చెప్పాడా ?

Tuesday, October 9th, 2018, 10:14:20 AM IST

ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా విషయంలో తెగ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు కథలు చెప్పినా కూడా అయన మాత్రం ఇంకా ఎవరికీ ఒకే చెప్పడం లేదు. అయితే అల్లు అర్జున్ నో చెప్పిన కొన్ని కథలు ..అతనిని సేఫ్ జోన్ లోనే పడేశాయి .. లేదంటే మరోటైప్ ఫలితం అందుకునేవాడు. దానికి తాజా ఉదాహరణ .. నోటా ? అవును ముందు ఈ కథ బన్నీ దగ్గరికే వెళ్లిందట. నిర్మాత జ్ఞాన్వెల్ రాజా బన్నీ కె ఈ కథను ముందు వినిపించారట. నిజానికి అల్లు అర్జున్ తో లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విబాషా చిత్రాన్ని ప్లాన్ చేసాడు .. కానీ ఆ కథ నచ్చకపోవడంతో బన్నీ నో చెప్పాడట, దాంతో ఆనంద్ శంకర్ నోటా కథను వినిపించాడట. అయితే తనకు ఈ కథ సెట్ కాదని .. పైగా ముఖ్యమంత్రి గా నేను బాగోనని చెప్పడంతో అది విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళింది. పొలిటికల్ నేపథ్యంలో కథ ఉండడంతో పాటు ఈ సినిమాతో అటు కోలీవుడ్ లోకూడా ఎంట్రీ ఇవ్వొచ్చని ఆలోచనతో విజయ్ ఈ సినిమాకు ఓకే చెప్పాడు. కానీ ఫలితం రివర్స్ అయింది. సినిమా విడుదలైన మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కి తీవ్ర నిరాశని మిగిల్చింది. నోటా దెబ్బకు అల్లు అర్జున్ సేఫ్ అయ్యాడంటూ ప్రచారం జరుగుతుంది. పాపం విజయ్ !!