ఫ్యాన్స్ కోసం పక్కా ప్లానింగ్ లో అల్లు అర్జున్.!?

Sunday, October 20th, 2019, 05:14:57 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో”. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మరో అధికారిక అప్డేట్ ను చిత్ర యూనిట్ వదిలారు.ఈ సినిమా నుంచి రెండో సాంగ్ తాలూకా టీజర్ ను విడుదల చేస్తామని తెలిపారు.దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసారు.ఈ పోస్టర్ ను కనుక గమనించినట్లయితే క్లాస్ గా ఉంది కానీ సాంగ్ టైటిల్ ఏమో మాస్ గా కనిపిస్తుంది.

ఒక్క సామజవరగమన సాంగ్ తప్ప మిగతా పోస్టర్ లు అన్ని కూడా పక్కా క్లాస్ అండ్ మాస్ లుక్ లోనే ఉంటున్నాయి.అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలు అంటే డాన్స్ లు తప్పని సరి కానీ ఈ మధ్య ఒకటి రెండు పాటలకు మినహా ఎక్కువగా ఉండడం లేదు.కానీ ఈసారి మాత్రం అలాంటివి ఏమీ తక్కువ చెయ్యకుండా ఈ చిత్రం ద్వారా బన్నీ అభిమానులకు ఫుల్ మీల్స్ గ్యారంటీ అని చెప్పడానికి ఈ పోస్టర్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.ఈ పోస్టర్ లో బన్నీ క్లాస్ గా కనిపించినా సాంగ్ బీట్ ని బట్టి మాస్ స్టెప్పులు మాత్రం అదిరిపోవడం ఖాయమని చెప్పాలి.మరి త్రివిక్రమ్ ఎలా ప్లాన్ చేసారో చూడాలి.