బన్నీ సినిమాకు ఓవర్సీస్లో స్ట్రాంగ్ బిజినెస్.!

Sunday, November 17th, 2019, 11:30:08 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” సినిమా పై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే.అందులోను ముచ్చటగా మూడోసారి బన్నీ మరియు త్రివిక్రమ్ లు చేస్తుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి ఒపీనియన్ ఈ చిత్రం మీద ఏర్పడింది.అయితే మన దగ్గర బన్నీ చిత్రాలకు మంచి డిమాండ్ మరియు మంచి వసూళ్లు వస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే.

అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో త్రివిక్రమ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది కానీ బన్నీ సినిమాలు మాత్రం అక్కడ అంతత మాత్రమే ఆడుతాయి.కానీ ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ కావడంతో అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ అయ్యినట్టు తెలుస్తుంది.సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 8.5 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.మరి ఈ చిత్రంతో అయినా సరే బన్నీ ఓవర్సీస్ లో మంచి స్టాండ్ తెచ్చుకుంటారో లేదో చూడాలి.