“దేశముదురు”లో బన్నీ డైలాగ్ ఇప్పుడు వేరే లెవెల్లో యాప్ట్ అయ్యింది.!

Monday, January 13th, 2020, 01:44:44 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబో లో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలను మించిన స్థాయిలో లేటెస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అల వైకుంఠపురములో” చిత్రం అక్కడ ఇక్కడా అని కాకుండా అదరగొడుతుంది.మన దగ్గర ఏమో కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం బన్నీ బ్యాటింగ్ మాములుగా లేదు.దాదాపు పదేళ్ల క్రితం ఇదే సంక్రాంతి బరిలో పూరి దర్శకత్వం వహించిన “దేశముదురు” చిత్రం ఇదే జనవరి 12న విడుదలయ్యి మాస్ హిట్ అయ్యింది.అలా ఇప్పుడు “అల వైకుంఠపురములో” విడుదలయ్యి మరోసారి బన్నీను సంక్రాంతి సిసలైన విన్నర్ గా నిలబెట్టింది.

అయితే అదే “దేశముదురు” సినిమాలోని ఓ డైలాగ్ ఉంటుంది.”నేను ఇక్కడ కొడితే రీసౌండ్ ఉదర్ ఆతా” అంటూ పూరి బన్నీ తో పేల్చిన డైలాగ్ అప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్.ఇపుడు అదే డైలాగ్ ను నిజం చేస్తూ ఓవర్సీస్ లో బన్నీ కొట్టిన దెబ్బ మాములుగా లేదు.భారీ పోటీ వాతావరణం నెలకొన్నా సరే రికార్డు స్థాయిలో అతి తక్కువ టికెట్ ధరతో వండర్స్ సృష్టించింది.60అలా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో ఏకంగా 60 వేలకు పైగా ప్రీమియర్స్ లో టిక్కెట్లు అమ్ముడుపోయి ఒక నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది అని చిత్ర యూనిట్ తెలిపారు.మొత్తానికి మాత్రం ఓవర్సీస్ మార్కెట్లో బన్నీ కొట్టిన దెబ్బకు రీసౌండ్ మాములుగా రాలేదని చెప్పాలి.