మరో చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసుకున్న బుట్టబొమ్మ వీడియో సాంగ్..!

Friday, July 10th, 2020, 08:06:05 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా సాంగ్స్, డ్యాన్స్‌లు కూడా హైలెట్‌గా నిలిచాయి.

అయితే ఈ సినిమాలోని బుట్ట బొమ్మ వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది.