ఈ దెబ్బకు విజయ్ మళ్ళీ ఈ ఫార్మాట్ జోలికి వెళ్తాడా.?

Saturday, February 15th, 2020, 01:08:08 PM IST


టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”.ఈ చిత్రం కూడా విజయ్ స్టార్డం కు తగ్గ హిట్ గా నిలవలేకపోయింది అని మొదటి ఆటతోనే నిరూపితం అయ్యిపోయింది.దీనితో ఇక విజయ్ పని అయ్యిపోయినట్టే అని అంతా భావిస్తున్నారు.అయితే ఒకవేళ విజయ్ కానీ సక్సెస్ కొడితే అది ఏ రేంజ్ లో ఉంటుందో కూడా పలు చిత్రాలు నిరూపించాయి.

వాటికి తోడు తన సినిమాల కోసం మరియు తన కెరీర్ కోసం విజయ్ చేసే ప్రమోషన్లను చూసి అతనంటే అసహ్యించుకునే వాళ్ళు కూడా అధికంగానే ఉన్నారు.అయినప్పటికీ విజయ్ తనదైన స్టైల్ లో వెళ్లిపోతూనే ఉన్నాడు.కానీ సినిమాల విషయంలో మాత్రం తాను తీసుకున్న నిర్ణయాలు అతని కెరీర్ కే దెబ్బ కొడుతున్నాయి.తన గత మూడు చిత్రాలు చూసుకున్నట్టయితే ఒకే ఫార్మాట్ ను ఫాలో అయ్యాయి.

కంటెంట్ పరంగా వేరే అయినాస్ సరే తన సినిమాలను ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చెయ్యడం మొదలు పెట్టాడు.ఇదే ఇప్పుడు విజయ్ పాలిట శాపంలా మారిందని సోషల్ మీడియాలో ఓ టాక్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.”నోటా”, “డియర్ కామ్రేడ్” ఇప్పుడు “వరల్డ్ ఫేమస్ లవర్” ఈ మూడు చిత్రాలను తెలుగుతో పాటుగా ఇతర దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేసారు.

కానీ ఈ మూడు వరుస ప్లాప్ చిత్రాలుగా నిలిచిపోయాయి.దీనితో ఇక విజయ్ ఈ ఫార్మాట్ ను పక్కన పెడతాడో లేదో అన్న అనుమానాలు విజయ్ ఫ్యాన్స్ ను కలవర పెడుతుండగా విజయ్ పూరితో చేస్తున్న సెన్సేషనల్ కాంబో అయినటువంటి “లైగర్” ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అని భయపడుతున్నారు.ఈ కాంబోపై మినిమమ్ గ్యారంటీ అని ఒక అంచనాకు వచ్చారు.కానీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్నామని చెప్పిన మాటే సెంటిమెంట్ ప్రేక్షకులను కలవరపెడుతుంది.మరి ఈ ఇద్దరి కాంబో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.