వర్మ నన్ను మోసం చేశాడంటున్న లేడి?

Tuesday, October 9th, 2018, 10:47:12 AM IST

సంచలన దర్శకుడు వర్మ నన్ను మోసం చేశాడంటూ ఓ లేడి కేసు వేసింది. వర్మపై లేడి కేసు వేయడం ఏమిటి ? అని షాక్ అవుతున్నారా ? ఇది నిజమే .. ఆ వివరాల్లోకి వెళితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ చనిపోయి దాదాపు చాలా కాలం అవుతుంది. అతని జీవిత కథతో వీరప్పన్ అనే సినిమా తీసాడు వర్మ. ఈ సినిమా విషయంలో వర్మ చాలా విషయాలు సేకరించాడు. వీరప్పన్ కు సంబందించిన పలు ఆసక్తికర విషయాలను షణ్ముఖ ప్రియా అనే మహిళనుండి తెలుసుకున్నాడు. ఆమెకు అన్ని వివరాలు చెబితే మంచి బహుమతిగా డబ్బులు ఇస్తానని చెప్పాడట. ఆ సినిమా వచ్చింది .. పోయి కూడా చాలా రోజులు అవుతుంది .. ఇప్పుడు ఆమె వర్మపై కేసు వేయడం సంచలనం గా మారింది. ఇన్నాళ్లు వర్మ తనకు ఇస్తానన్న మొత్తాన్ని ఇవ్వకుండా మోసం చేసాడని చెప్పింది. అసలు షణ్ముఖ ప్రియా ఎవరు .. ? అంటే అప్పట్లో వీరప్పన్ ని పట్టించడంలో షణ్ముఖ ఫిర్యా కీలక పాత్ర పోషించింది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తో స్నేహం చేసిన ఆమె అన్ని విషయాలు సేకరించి పోలీసులుకు తెలిపేది. అలా అలా ఆమె కోవర్ట్ గా వ్యవహరించడమతొ కేంద్ర ప్రభుత్వం కూడా భారీ నజరానాను ప్రకటించింది. ఐదు కోట్లతో పాటు ప్లాట్ కూడా ఇస్తామని చెప్పారు .. కానీ వీరప్పన్ ను చంపాక ఆమెకు ఎలాంటి నజరానా అందలేదు. ఆ తరువాత తనకు వివరాలు తెలిపితే డబ్బు ఇస్తానని చెప్పి వర్మ కూడా మోసం చేయడంతో ఆమె ఫ్రస్టేషన్ కు గురై కేసు వేసింది. వర్మ తనవద్ద చాలా విషయాలు సేకరించాడని, కానీ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని ఫైర్ అయింది. మరి ఈ విషయం పై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇప్పటికే వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తో థ్రెడ్ ఉందని .. ఈ విషయం పై ప్రధానమంత్రి కి కూడా పిర్యాదు చేసానని ఎలాంటి రెస్పాన్స్ లేదని, తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని .. ఈ విషయంలో ప్రభుత్వమో, లేక వర్మ కాపాడాలని పేర్కొంది.