సింగర్ కార్తీక్ నన్ను వేదించాడంటున్న మహిళ ?

Saturday, October 13th, 2018, 06:09:26 PM IST

మొత్తానికి మీ టూ అంటూ తమపై జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారాలను పలువురు లేడీ సెలబ్రిటీలు బాగానే బయటపెడుతున్నారు . అయితే రోజు రోజుకు ఈ వ్యవహారం దావానంలా వ్యాపిస్తుంది. తాజాగా తనపై ఆ సింగర్ కార్తీక్ కూడా లైంగిక వేధింపులు చేసాడని ఓ మహిళా పిర్యాదు చేసింది? సదరు మహిళా ఈ విషయాన్నీ లేడి జర్నలిస్ట్ సంధ్య మీనన్ కు మెసేజ్ చేసిందట . గాయకుడూ కార్తీక్ లైంగిక వేధింపులకు తాను బాధితురాలిని అంటూ ఆ మహిళా పేర్కొన్న నేపథ్యంలో ఈ విషయంపై సంధ్య ట్విటర్ లో పోస్ట్ చేసింది.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాతొ సింగర్ కార్తీక్ అసబ్యాంగా ప్రవర్తించాడని చెప్పింది. ఈ విషయం అప్పుడే కొందరికి చెప్పాలని అనుకున్నాను కానీ అతను పాపులర్ సింగర్ కాబట్టి నా మాట ఎవరు నమ్మరని ఆగిపోయాను. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పాలో తెలియక మీరు ట్విట్టర్ లో తెలుపుతున్నా అంటూ సదరు మహిళా తెలిపిందట. టూర్స్ కు వెళ్ళినప్పుడు లేడి సింగర్స్ పై ఇలాంటి వేధింపులు తప్పవని ఆమె తెలిపిందట.