ఉండీ లేనట్టు ఆ డ్రెస్ ఏమిటి క్యాథరిన్..!

Monday, June 20th, 2016, 05:35:25 PM IST


సాధారణంగా హీరోయిన్లు చిన్న చిన్న ఫంక్షన్లకే దిమ్మ తిరిగిపోయేట్టు మేకప్ వేసుకుని అదిరిపోయే డ్రెస్సుల్లో వస్తుంటారు. అలాంటిది సౌత్ ఇండియా ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం అంటే ఇక ఆగుతారా. హీరోయిన్లందరూ ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించేశారు. కొందరు కళ్ళు చెదిరేలా డ్రెస్సులు వేసుకొస్తే మరి కొందరు మాత్రం మనసు చెదిరేలా డ్రెస్ వేసుకొచ్చారు. వాళ్ళలో ముందుగా అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది మాత్రం నటి ‘క్యాథరిన్ థ్రెస’ అనే చెప్పాలి.

ఎందుకంటే ఈ అమ్మడు వేసుకొచ్చిన డ్రెస్ అలా ఉంది మరీ. ఎవరికో అవార్డ్ ఇవ్వడానికి స్టేజి పైకి వచ్చిన క్యాథరిన్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఆ డ్రెస్ ఎలా ఉందంటే ఓ పరదలా అమ్మడి అందాలను కనిపించీ కనిపించనట్టు బయటపెడుతూ చూపరులను కట్టిపడేసింది. మోకాళ్ళ వరకూ పరవాలేదనిపించినా ఆ పై భాగంలో కూడా దాదాపు అలానే ఓ లేయర్ లా ఉండి అమ్మ బాబోయ్ ఇది డ్రెస్సా, దొమతెరా అనిపించింది. ఏదేమైనా ఫంక్షన్ మొత్తంలో క్యాథరిన్ డ్రెస్సే హైలెట్ అని చెప్పొచ్చు. స్వతహాగా రిచీ రిచ్ అయిన క్యాథరిన్ ఈ ఉండీ లేనట్టు ఉన్న డ్రెస్ కోసం ఎంత ఖర్చు చేసిందో మరి.