సెల‌బ్రిటీల లైఫ్ `ఫైన‌ల్ డెస్టినేష‌న్‌` తీరుగ‌!!

Wednesday, October 3rd, 2018, 11:48:14 AM IST

రేపు ఏం జ‌ర‌గ‌బోతోందో ఈరోజే తెలిస్తే దానిని ఏమ‌ని అంటారు.. సిక్త్స్ సెన్స్ అంటారు. ఏది రాసిపెట్టి ఉంటే అది జ‌రిగితే దానిని డెస్టినీ అంటారు. ఈ రెండిటినీ క‌లిపితే.. డెస్టినేష‌న్‌. మ‌నం ఎన్ని అనుకున్నా ఏది జ‌ర‌గాలో అదే జ‌రిగితే.. అంతిమంగా మ‌ర‌ణం ప్రాప్తిస్తే దానినే `ఫైన‌ల్ డెస్టినేష‌న్‌` అని అంటారు. హాలీవుడ్‌లో తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించిన `ఫైన‌ల్ డెస్టినేష‌న్‌` సిరీస్ సినిమాల్ని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. రాబోవు కాలంలో .. మ‌రుక్ష‌ణంలో మ‌ర‌ణం వెంటాడుతోంది అన్న సంగ‌తి ముందే తెలిసిపోతుంటుంది. కానీ దానిని ఆప‌లేరు. ఆపేందుకు ప్ర‌య‌త్నించే క్ర‌మంలోనే డెస్టినేష‌న్ ప్లేస్‌కి వెళ్లిపోతుంటారు. య‌ముడు చివ‌రికి బ‌లి కోరతాడు.

అయితే అదే త‌ర‌హాలో మ‌న సెల‌బ్రిటీలంతా మృతి చెందుతున్నారా? అంటే.. అవున‌న‌డానికి ఎన్నో సాక్ష్యాలు క‌నిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్ యాక్సిడెంట్ .. జ‌ర‌గ‌క‌ముందే అందుకు సంబంధించిన సింప్ట‌మ్స్ హెచ్చ‌రిక‌లుగా క‌నిపించాయ‌న్న మాటా వినిపించింది. వెళుతున్నా.. మ‌ళ్లీ వ‌స్తానో రానో.. అంటూ డెస్టినేష‌న్ ప్లేస్‌కి వెళుతున్న‌ట్టే హ‌రికృష్ణ ఓ మ్యారేజ్ ఈవెంట్ వ‌ద్ద అన‌డం చ‌ర్చ‌కొచ్చింది. అంత‌కుముందు నంద‌మూరి కుటుంబంలో యాక్సిడెంట్ల‌ను రిలేటెడ్ గానే మాట్లాడుకున్నారు. అలానే ఇందిరాగాంధీ పై శిక్కు బాడీ గార్డ్స్ (స‌త్వ‌న్ సింగ్- భీన్ట్ సింగ్‌) ఎటాక్, రాజీవ్ గాంధీపై మాన‌వ బాంబ్ ఎటాక్ వీట‌న్నిటికీ ముందు వాళ్ల‌కు ఎటాక్స్ గురించి స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక‌లు ఉన్నాయి. దీనిపై ఇప్ప‌టికే సినిమా కూడా తీశారు కృష్ణ‌వంశీ. మ‌హేష్ `మురారి` చిత్రానికి ఇందిరాగాంధీ ఫ్యామిలీలో మ‌ర‌ణాలే స్ఫూర్తి అని అప్ప‌ట్లో మాట్లాడుకున్నారు.

తాజాగా హ‌రికృష్ణ సినిమాటిక్ యాక్సిడెంట్‌ని మ‌ర్చిపోక ముందే అంత‌కుమించిన సినిమాటిక్ యాక్సిడెంట్‌లో న‌ట‌సింహా, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ద‌గ్గ‌ర చుట్టం. త‌న వియ్యంకుడి తండ్రిగారు, వైజాగ్‌- గీతం యూనివ‌ర్శిటీ వ్య‌వ‌స్థాప‌క అధినేత, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి చ‌నిపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అమెరికాలో తెలుగు వాడి డెస్టినీ ఇలా రాసిపెట్టి ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. మొత్తానికి సెలబ్రిటీల జీవితం ఊహాతీతం అనిపించే డెస్టినీ .. అని చెప్పొచ్చు.