ఓ బేబీలో కనిపించనున్న నాగ చైతన్య ?

Thursday, July 4th, 2019, 10:48:21 PM IST

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో రేపు రాబోతున్న సినిమా ‘ఓ బేబీ’. జీవితంలో అన్ని దశల్లో కష్టాలు తప్ప ఎన్నడూ సుఖపడని ఓ 70 ఏళ్ల బామ్మకి.. విచిత్రంగా 20 ఏళ్ల యంగ్ లేడీగా మారే అవకాశం వస్తే.. నిజంగానే ఇరవై ఏళ్ల యువతిగా మారిపోతే.. అప్పుడు ఆ ఇరవై ఏళ్ల యువతి 70 ఏళ్ల వృద్ధురాలిగా ప్రవర్తిస్తే.. ఎలా ఉంటుందనే అంశాలు ప్రధానంగా ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో నాగచైతన్య చిన్నపాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపించనున్నాడట. కేవలం కొన్ని క్షణాలే అయిప్పటికీ సినిమాలో కీలకమైన పాత్రలోనే చైతు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన మజిలీ. సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ ‘ఓ బేబీ’లో ఈ రియల్ జంట.. రీల్ లైఫ్ లో కనిపిస్తే.. అక్కినేని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులైపోవడం ఖాయం. ఇక కొరియన్ మూవీ ‘మిస్ గ్రాని’కి అనువాదంగా తెలుగు, తమిళ భాషల్లో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా చూసిన అందరూ తమ జీవితాల్లోని మదర్ ఎమోషన్ని గుర్తుకు తెచ్చుకునేలా ఈ సినిమా ఉండబోతుందట.