నాగార్జున ఇంట్లో పూజ‌లు మొద‌ల‌య్యాయి

Sunday, September 25th, 2016, 08:28:27 PM IST

akkineni-family
అక్కినేని వారి ఇంట్లో పెళ్లిసంద‌డి షురూ అయ్యేలానే క‌నిపిస్తోంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌తో నాగార్జున ద‌గ్గ‌రుండి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేయించారు. అయితే ఆ పూజ‌లు ఎందుకోసం, ఎక్క‌డ చేయించార‌నేది మాత్రం బ‌య‌టికి రాలేదు. అందుకు సంబంధించిన ఫొటోలు మాత్రం బ‌య‌టికొచ్చాయి. ఆ ఫొటోల్లో చుట్టూ వేద‌పండితులు ఉండ‌గా నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు చాప‌పై కూర్చుని పూజ‌లు చేస్తున్నారు. ప‌క్క‌నే నాగార్జున కూడా ఉన్నారు. త్వ‌ర‌లోనే చైతూ, స‌మంత‌లు పెళ్లి చేసుకోనున్న విష‌యం తెలిసిందే. వచ్చే యేడాదే మా పెళ్లి జ‌రుగుతుంద‌ని స‌మంత కూడా ప్ర‌కటించింది. తండ్రిగా నాగార్జున త‌న బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌డంపై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల పెళ్లి త‌ర్వాత నాగార్జున అఖిల్ పెళ్లి సంద‌డితో బిజీ కాబోతున్నారు. ఇద్ద‌రి కొడుకుల పెళ్ళిళ్లు ఒకే యేడాదిలో జ‌రిపించాల‌ని నాగ్ నిర్ణ‌యించారు.