చక్రి అంత్యక్రియలు పూర్తి!

Monday, December 15th, 2014, 07:00:28 PM IST

chakrii
ప్రముఖ సంగీత దర్శకులు చక్రి సోమవరం ఉదయం గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం సాయంత్రం చక్రికి పంజాగుట్ట స్మశాన వాటికలో అత్యక్రియలను పూర్తి చేశారు. అలాగే జర్నలిస్ట్ కాలనీని ఆయన స్వగృహం నుండి పంజాగుట్ట వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. ఇక చక్రి ఆకస్మిక మృతితో తెలుగు చిత్రసీమ దిగ్బ్రాంతికి గురైంది. అలాగే ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు తరలి వచ్చి ఆయన భౌతిక కాయంపై పుష్ప గుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు.

కాగా వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన చక్రధర్ గిల్లా సినీరంగంలో చక్రిగా ప్రసిద్ధికెక్కారు. ఎన్నో హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం చేసి మేటి సంగీత దర్శకుడిగా చక్రి పేరుగాంచారు. బాచి సినిమా ద్వార చిత్ర రంగ ప్రవేశం చేసిన చక్రి 85 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. ఆయన ఆఖరు చిత్రం ఎర్రబస్సు. కాగా చక్రి 1974, జూన్ 15న జన్మించారు. ఎందరో గాయనీ గాయకులను చిత్రరంగానికి పరిచయం చేసిన చక్రి మరణం సినీ ప్రపంచాన్ని విభ్రాంతికి గురి చేసింది.