RC12 భారీ టార్గెట్ పెట్టుకున్న చరణ్ అభిమానులు..అందుకోగలరా?

Thursday, November 1st, 2018, 07:11:31 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ మరియు బోయపాటిల కాంబినేషన్లో రాబోతున్న చిత్రం.ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని ఇంకా విడుదల చెయ్యకపోయినా ఈ దీపావళికి మాత్రం విడుదల చేస్తారు అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విషయంలో చెర్రీ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నారు.

చెర్రీ యొక్క ఫస్ట్ లుక్ విడుదల కాగానే దాన్ని ట్విట్టర్లో ప్రపంచ స్థాయి ట్రెండింగ్ చెయ్యాలని చెర్రీ అభిమానులు ఇప్పుడు ప్లాన్ లు వేసుకొని ఫోటోలు కూడా మార్చేసుకుంటున్నారు.ఇప్పటికే ఫస్ట్ లుక్ విషయంలో పవన్ మరియు వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రం యొక్క రికార్డు ఉంది.వీరు కూడా అదే స్థాయిలో చరణ్ యొక్క ఫస్ట్ లుక్ ని ట్రెండ్ చెయ్యాలని చూస్తున్నారు.అయితే వీరు 24 గంటల్లో 1 మిలియన్ ట్వీట్స్ చేసి ప్రపంచ స్థాయిలో రికార్డు నమోదు చెయ్యాలని ఆలోచిస్తున్నారు.మరి వీరి టార్గెట్ ని అందుకుంటారో లేదో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments