చరణ్ ప్లాప్ మళ్ళీ అదే రేంజ్ రేటింగ్ కొడుతుందా?

Sunday, May 24th, 2020, 12:38:13 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “వినయ విధేయ రామ”. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడి భారీ ప్లాప్ గా నిలిచింది.

అయినా సరే మాస్ కంటెంట్ మరియు మంచి ఫ్యామిలి ఎమోషన్స్ ఉండడం మూలాన జెనరల్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. దీనితో వెండితెర మీద ఫెయిల్ అయిన ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై మాత్రం భారీ విజయం సొంతం చేసుకుంది.

స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయిన ప్రతీ సారి కూడా మినిమం గ్యారంటీ టీఆర్పీ రాబట్టింది. అలా ఈ ఆదివారం మధ్యాహ్నం కూడా స్టార్ మా లో ప్రసారం కానుంది. మరి ఈసారి కూడా అంతే స్థాయిలో టీఆర్పీ రాబడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే చాలా సార్లు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసారు. మరి ఈ చిత్రం ఈసారి ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.