రాజమౌళి సినిమాకోసం సిద్దమవుతున్న చరణ్ ?

Wednesday, October 24th, 2018, 10:14:31 PM IST

బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న రాజమౌళి నెక్స్ట్ సినిమా విషయంలో సర్వత్రా ఆసక్తి ఎక్కువైంది. ఇద్దరు టాలీవుడ్ క్రేజీ హీరోలతో మల్టి స్టారర్ ప్లాన్ చేయడమే ఇందుకు కారణం. లేటెస్ట్ గా అరవింద సమేత తో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ ఈ ఇద్దరి అభిమానుల్లో నెలకొంది. ఇకపోతే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. స్వాతంత్రోద్యమ కాలం నాటి కథతో ఉంటుందని ప్రచారం అయితే జరుగుతుంది. కథ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే లేదు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలు కానుందట. ఇందులో ఎన్టీఆర్, చరణ్ ల మేక్ ఓవర్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. అందుకోసం ఈ యూనిట్ వర్క్ షాప్ ని నవంబర్ లో జరపనుంది. అందులో ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరు పాల్గొంటారు. ఇక పొతే ఈ సినిమా షూటింగ్ లో చరణ్ జనవరిలో పాల్గొంటాడని .. సమాచారం. ప్రస్తుతం చరణ్ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం మరో నెలరోజులు పనిచేయనున్న నేపథ్యంలో నవంబర్ చివరి నుండి డిసెంబర్ వరకు జరిగే వర్క్ షాప్ లో పాల్గొని ఆ తరువాత జనవరిలో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఇక ఈ ఇద్దరు హీరోల సరసన నటించే హీరోయిన్స్ కోసం అన్వేషణ మొదలైంది. ఇప్పటికే కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments