అది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే.. విజయ్ సినిమాపై చార్మీ క్లారిటీ..!

Tuesday, May 19th, 2020, 01:11:32 AM IST

టాలీవుడ్ రౌడీబాయ్‌గా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు విజయ్. దీని తరువాత గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే గత ఏడాది వచ్చిన డియర్ కామ్రేడ్, ఈ ఏడాది వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయి ప్లాపులను మూటగట్టుకున్నాయి.

అయిరే ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో విజయ సరసన నటిస్తుంది. అయితే ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు రాగా, దీనిపై స్పందించిన హీరోయిన్, సహనిర్మాత అయిన ఛార్మి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి ఫైటర్ అఫిషియల్ టైటిల్ కాదని, వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని ప్రకటించింది. పూరి, విజయ్ సినిమా అంటే మినిమం టైటిల్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.