“వినయ విధేయ రామ” టీజర్ కి కూడా భారీ టార్గెట్..ఫిక్స్..!

Thursday, November 8th, 2018, 08:03:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చే సంక్రాంతికి రాబోతున్న చిత్రం “వినయ విధేయ రామ”,అయితే ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవలే విడుదల చేసిన రామ్ చరణ్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది.ఆ పోస్టర్ కే చరణ్ అభిమానులు ట్విట్టర్ లో ప్రపంచ స్థాయిలో ట్రెండ్ సెట్ చేసి కొత్త రికార్డులు సృష్టించారు.ఇప్పుడు కూడా అదే జోరుని రేపు ఉదయం విడుదల కాబోయేటటువంటి టీజర్ కి కూడా కొనసాగించాలి అని ప్రణాళికలు వేసుకుంటున్నారు.

ఒక పక్క యూట్యూబ్ వ్యూస్ మరియు లైక్స్ మరో పక్క ట్విట్టర్ లో కూడా సరికొత్త రికార్డులను సృష్టించాలని ఉవ్విళూరుతున్నారు.ఇప్పటికే ఈ మాస్ కాంబినేషన్ మాస్ ఫస్ట్ లుక్ తో సంచలనం సృష్టించారు.రేపు విడుదల కాబోయే టీజర్ కి కూడా కొత్త లెక్కలు పరిచయం చెయ్యడానికి అభిమానులు అందరు సిద్ధం కావాలి అని సోషల్ మీడియాలో అప్రమత్తం చేస్తున్నారు.ఇప్పటికే ఫస్ట్ లుక్ విషయంలో ప్రపంచస్థాయి రికార్డును నెలకొల్పారు.ఇక ఈ టీజర్ విషయంలో ఎలాంటి రికార్డులు నెలకొల్పుతారో వేచి చూడాలి.