రామ్ చరణ్ పై సీరియస్ అవుతున్న చిరంజీవి – కారణం గట్టిదే మరి…?

Thursday, February 27th, 2020, 01:01:32 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే, మరొక వైపు నటనలోనూ చక్కటి చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు రామ్ చరణ్. అలంటి హీరో పై సామాజిక మాంద్యమాల్లో ఒక వార్త వైరల్ గా చక్కర్లు కొడుతోంది. కాగా రామ్ చరణ్ పై తన తండ్రి చిరంజీవి సీరియస్ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ తన సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడని, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని చిరు ఆగ్రహిస్తున్నారని సమాచారం.

కాగా ప్రస్తుతానికి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ ఎలాగోలాగ జూన్ లోపల ఆ షూటింగ్ పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా మరొక సినిమాకు రామ్ చరణ్ ఓకే చెప్పలేదని సమాచారం. కాగా ఇప్పటికే రాజమౌళి చిత్రం తరువాత ఎన్టీఆర్, త్రివిక్రంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు, కానీ రామ్ చరణ్ ఇంత వరకు ఎలాంటి కథలు వినలేదంట, అంతేకాకుండా చిరంజీవి ప్రత్యేకంగా కలుగజేసుకొని మరీ కొందరు దర్శకులను రామ్ చరణ్ దగ్గరకు పంపించినప్పటికీ కూడా రామ్ చరణ్ ఏ కథను పూర్తిగా వినడం లేదని చిరంజీవి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. కెరీర్ ప్రారంభంలోనే ఇలా సినిమాలు ఆలస్యం చేయొద్దని చిరంజీవి వారిస్తున్నారంట…