రాననుకున్నావా.. రాలేననుకున్నావా.. మోహన్ బాబుకు చిరు స్వీట్ రిప్లై..!

Thursday, March 26th, 2020, 08:48:15 PM IST

మెగస్టార్ చిరంజీవి తన అభిప్రాయలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా చక్కటి వేదిక అని, ఇకపై సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటానని తాజాగా ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్స్‌ని ఓపెన్ చేసుకున్నాడు చిరు.

అయితే ఉగాది సందర్భంగా చిరంజీవి నిన్న తన తొలి పోస్ట్ చేశాడు. చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ తారలు సైతం ఆయనని ఫాలో అవుతూ స్వాగతం పలుకుతున్నారు. అయితే చిరుకు యాక్షన్ కింగ్ మోహన్ బాబు వెల్ కం మిత్రమా అంటూ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేయగా, దానికి చిరంజీవి స్వీట్ రిప్లై ఇచ్చాడు. థాంక్యూ మిత్రమా రాననుకున్నవా.. రాలేననుకున్నవా అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగ్ ని పోస్ట్ చేశారు.