బిగ్ అప్ డేట్ : చిరు కొరటాల సినిమా కథ ఇదేనంట – ఎలా ఉందొ చెప్పండి…?

Tuesday, October 15th, 2019, 10:17:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి సైరా విజయాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతానికి చిరంజీవి తాజాగా సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. ఇకపోతే ఎలాంటి స్టార్ ని ఎలా వాడుకోవాలి అనేది కొరటాల శివ కి బాగా తెలుసు. అందుకే మెగాస్టార్ చిరంజీవి కోసం శివ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాడని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త పుకార్లు షికార్లు చేస్తుంది.

ఈ సినిమాలో చిరంజీవి ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో జరుగుతున్నటువంటి అవినీతి వలన, మన దగ్గరి దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మన సమాజానికి జరిగే హాని గురించి సినిమాలో నిశితంగా చెప్పనున్నారంట. ఇకపోతే రాజకీయ నాయకులందరూ కూడా దేవాలయాల భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారు. చివరికి ఎంతో ప్రతిష్టాత్మకమైన గుడులనే మన రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారు. అయితే అలంటి వారికి చిరు సింహ స్వప్నంగా మారనున్నారని సమాచారం. కానీ ఈ విషయాన్నీ కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.