మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహంతో టాలీవుడ్లో అసలైన సందడి నెలకొంది. ఆగష్టులో నిశ్చితార్థం చేసుకున్న నిహారిక, చైతన్యల జంట ఈ నెల 9వ తేదిన మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతుంది. అయితే మెగా, అల్లు ఫ్యామిలీలోని కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ ఈ రోజు ఉదయమే చార్టడ్ ప్లైట్లలో ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అందరూ కలిసి నిహారికను పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు.
అయితే తాజాగా నిహారిక చైతుల సంగీత్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ సంగీత్‌లో పెదనాన్న చిరంజీవి పాటలకు నిహారిక తనకు కాబోయే భర్త చైతుతో కలిసి స్టెప్పులు వేసింది. వీరితో పాటు మెగా, అల్లు ఫ్యామిలీలోని చిన్నారులు కూడా చిరంజీవి పాటలకు డ్యాన్సులు చేసి అలరించారు. ప్రస్తుతం ఈ సంగీత్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.