మెగాస్టార్ 152 అప్డేట్ కు సమయం వచ్చేసిందా..?

Monday, December 9th, 2019, 06:40:36 PM IST

ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పాలి.గత కొన్ని రోజుల నుంచి మణిశర్మ విషయంలో బజ్ గా వినిపిస్తున్న వార్తా నిన్నటితో నిజం అని తెలిసే సరికి ఇక అసలు మజా కోసం వారు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.”సైరా” చిత్రం తర్వార మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.అలాగే దర్శకుడ్ కొరటాల శివ మరియు సంగీత దర్శకుడు మణిశర్మ చేసిన ప్లానింగ్ ఇప్పటికే ఒకే అయ్యిపోయినట్టు చెప్పాలి.

అలాగే మెగాస్టార్ చిరు కూడా తన మేకోవర్ ను కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టుగా రీసెంట్ గా ఆయన దిగిన ఫోటోలను చూస్తే అర్ధం అవుతుంది.ఇలా ఓ పక్క కొరటాల మరియు మణిశర్మలు ఒక ఫైనల్ డెసిషన్ కుక్ రావడం అలాగే మెగాస్టార్ కూడా ఇక షూటింగ్ లోకి దిగబోడానికి సన్నద్ధం అవుతున్నట్టుగా కనిపించడం చూస్తుంటే అతి త్వరలోనే ఒక మెగా అప్డేట్ రావడం ఖాయమని అనిపిస్తుంది.మరి ఆ అప్డేట్ ఎంత త్వరగా అందించి అభిమానులను ఆనందపరుస్తారో చూడాలి.