మెగాస్టార్ నెక్స్ట్ మూవీకి రంగం సిద్ధమవుతోంది !!

Thursday, February 16th, 2017, 10:45:20 PM IST


మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం ఘనవిజయం సాధించి మెగాస్టార్ మేనియా ఇంకా తగ్గలేదని నిరూపించడమే కాకుండా ఈ సినిమాతో చిరంజీవి ఏకంగా వందకోట్ల మార్కెట్ ను కొల్లగొట్టాడు. ఈ సినిమా తరువాత ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా చేస్తున్న చిరంజీవి తన నెక్స్ట్ సినిమా 151 పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అయన నెక్స్ట్ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడో తెలుసా మే లో ప్రారంభం అవుతుందట .. ? అయితే అదికూడా మెగా ఫాన్స్ మధ్యలో అని తెలిసింది. నిజానికి ఖైదీ నంబర్ 150 వ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ని మెగా ఫాన్స్ మధ్యలో చేయాలనీ అనుకున్నారు, కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు .. దాంతో మెగా ఫాన్స్ కాస్త నిరాశతో ఉన్నారట!! అందుకే వాళ్ళను ఖుషి చేయడానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను ఫాన్స్ మధ్య లాంచింగ్ చేయాలనీ మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నాడట !! సురేందర్ రెడ్డ్డి దర్శత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఖైదీ కి కాకున్నా తన నెక్స్ట్ సినిమా అయినా దగ్గరుండి చూసే ఛాన్స్ కొట్టేశారు మెగా ఫాన్స్ !!