పసుపులేటి మృతికి సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు…

Tuesday, February 11th, 2020, 10:30:23 PM IST

ప్రముఖ సినీ పీఆర్వో, సీనియర్ పత్రికా పాత్రికేయుడు పసుపులేటి రామారావు మరణంపై ప్రముఖ సినీ నటులు, నిర్మాతలు, సినీ వర్గానికి చెందిన పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా పలువురు నటులు సామాజిక మాంద్యమాల ద్వారా పసుపులేటి మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రముఖ నటుడు చిరంజీవి ఇప్పటికే పసుపులేటి భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా పసుపులేటి రామారావు మరణంపై సినీ నటులు పవన్‌కల్యాణ్‌, మోహన్‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు సామాజిక మాంద్యమాలను వేదికగా మలుచుకొని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాగా నటుడు మోహన్ బాబు స్పందిస్తూ… పసుపులేటి రామారావు మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన చెందారు. అంతేకాకుండా ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యానని చెప్పారు. కాగా నటుడిగా పరిచయం అయినప్పటినుండి కూడా ఆయనతో మంచి సాన్నిహత్యం ఉందని, ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని వాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మోహన్‌బాబు అన్నారు.

మరొక ఈ మేరకు నటుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… పసుపులేటి రామారావు మరణించారనే వార్త బాధకు గురి చేసిందని, పసుపులేటి మరణం తీరని లోటు అని పవన్‌కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పసుపులేటి రామారావు తో వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారని, ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.