సీఎం భ‌ర‌త్ టీష‌ర్ట్స్ ఒక‌టి కొంటే ఒకటి ఫ్రీ!

Wednesday, April 18th, 2018, 08:38:39 PM IST

సీఎం భ‌ర‌త్ ప్ర‌స్తుతం ఇంటా బ‌య‌టా స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర టాపిక్‌. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ముఖ్య‌మంత్రి గెట‌ప్, న‌ట‌న ఎలా ఉంటుందో వెండితెర‌పై చూడాల‌న్న ఆస‌క్తి అభిమానులు స‌హా అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. `భ‌ర‌త్ అనే నేను` ఈనెల 20న రిలీజ‌వుతున్న వేళ ఎక్క‌డ చూసినా భ‌ర‌త్ మానియా క‌నిపిస్తోంది. ఈ మానియా కేవ‌లం ఇటు సినిమా ట్రేడ్‌లోనే కాదు, అటు వ‌స్త్ర దుకాణాల్లోనూ ఓ రేంజులో ఊపేస్తోంది. ఇదిగో ఈ ఫోటోనే అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.

సీఎం భ‌ర‌త్ టీష‌ర్టులు అమ్మ‌బ‌డును.. అన్న‌ట్టు ఆ షాప్ య‌జ‌మాని ఫేస్ చూశారా? మ‌హేష్ క్రేజును ఎంత తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారో చూడండి. ఈ త‌ర‌హాలో స్టార్ ఇమేజ్ ఉప‌యోగించి, స్టార్ల ఫోటోల్ని ఇలా బ‌ట్ట‌ల‌పై ప్రింట్ చేసే ప‌ద్ధ‌తి చాలా కాలంగా ఉన్న‌దే. శ్రీ‌మంతుడు సైకిల్‌ని వేలంలో అభిమాని ద‌క్కించుకోవ‌డం కంటే ఇది భిన్న‌మైన‌ది. ఇక్క‌డ భ‌ర‌త్ టీష‌ర్టుల పేరుతో కొన్ని వంద‌ల కుటుంబాల‌కు ఉపాధి దొరికింద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. మంచిదే…భ‌ర‌త్ ఛ‌రిష్మాకే ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments